Thuli Thuli Mazhaiyaai

Thuli Thuli Mazhaiyaai a song by Yuvan Shankar Raja on Foxsoundi — Free Music, Smart Streaming for Everyone

Thuli Thuli Mazhaiyaai by Yuvan Shankar Raja

Thuli Thuli Mazhaiyaai Lyrics

చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరుక్షణమున మరుగైపోయావే
నువ్వే ప్రేమ బాణం నువ్వే ప్రేమ కోణం
పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం
చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే
యదనే నీతో ఎత్తుకెళ్ళావే
చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరుక్షణమున మరుగైపోయావే
దేవతా తనే ఒక దేవత
ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా
గాలిలో తనే కదా పరిమళం
చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా
సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళ
గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరచే
చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమెయ్యాల
చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే
యదనే తనతో ఎత్తుకెళ్ళిందే
చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే
తోడుగా ప్రతీక్షణం వీడకా
అనుక్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందన
నేలపై పడేయక నీడనే చక చక చేరనా
ఆపనా గుండెలో చేర్చనా
దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే
గాయం లేక కోసేసిందే హాయిగా నవ్వేసిందే
నాలో నేను మౌనంగానే మాటాడేస్తే
మొత్తం తాను వింటూ ఉందే తియ్యగ వేధిస్తుందే
యదనే తనతో ఎత్తుకెళ్ళిందే
చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే
చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరుక్షణమున మరుగైపోయావే
చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరుక్షణమున మరుగైపోయావే

From the album: Evergreen Love